బార్లీ.( Barley ) అద్భుతమైన తృణధాన్నాల్లో ఒకటి.
ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఆరోగ్యానికి బార్లీ వరం అనే చెప్పుకోవచ్చు.బార్లీ గింజల్లో విటమిన్ బి, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్, డైటరీ ఫైడర్, యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందువల్ల హెల్త్ పరంగా బార్లీ ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో బార్లీ గింజలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకున్నారంటే మస్తు బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు బార్లీ గింజలు వేసుకుని మూడు నాలుగు సార్లు వాటర్ తో కడగాలి.ఆపై ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న బార్లీ గింజలను వాటర్ తొలగించి వేసుకోవాలి.ఆపై రెండు గ్లాసులు ఫ్రెష్ వాటర్ పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన బార్లీ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ), చిటికెడు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
రెగ్యులర్ గా ఈ బార్లీ వాటర్ ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.ముఖ్యంగా సమ్మర్ లో ఈ బార్లీ వాటర్ ను మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా రక్షిస్తుంది.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.
శరీరంలో వేడిని తొలగిస్తుంది.తక్షణ శక్తిని చేకూరుస్తుంది.
అలాగే బార్లీ వాటర్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు ఒక అద్భుత పానీయం.ఈ డ్రింక్ శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లను సైతం కరిగిస్తుంది.
బార్లీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల బార్లీ మీ జీర్ణక్రియ మరియు జీవక్రియను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతంది.బార్లీని పైన చెప్పిన విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాయి.
మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా బార్లీ వాటర్ ఎంతో మేలు చేస్తుంది.బార్లీ వాటర్ ను రోజూ తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి గ్రేట్ గా సహాయపడతాయి.
అంతేకాకుండా బార్లీ వాటర్ ఎముకలను బలోపేతం చేస్తాయి.రక్తపోటును నివారిస్తాయి.
మరియు గర్భిణీ స్త్రీలకు బార్లీ వాటర్ సరైన ఆరోగ్య పానీయంగా పరిగణించబడుతుంది.