తలనొప్పి( Headache )..
అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.తలనొప్పి అనేది చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.
రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిస్తుంది.పనిపై ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
తలనొప్పి రావడానికి కారణాలు అనేకం.కంటినిండా నిద్ర లేకపోవడం, అతిగా నిద్రించడం, డీహైడ్రేషన్( De hydration ), పోషకాల కొరత, నిత్యం మద్యం సేవించడం తదితర కారణాల వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతుంది.
అయితే ఒక్కోసారి భరించలేనంత తల నొప్పితో బాధపడుతూ ఉంటారు.అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను కనుక పాటిస్తే క్షణాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుని పదండి.
తలనొప్పికి నిర్జలీకరణం ఒక సాధారణ కారణమని అధ్యయనాలు నిరూపించాయి.అందువల్ల తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఎక్కువ నీరు( Water ) త్రాగండి.ఇలా చేయడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.చాలా మంది తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు.కానీ B-కాంప్లెక్స్ సప్లిమెంట్ తలనొప్పిని తగ్గించడానికి అద్భుతంగా వర్కోట్ అవుతుంది.రిబోఫ్లావిన్ (B2), ఫోలేట్(B9), పిరిడాక్సిన్ (B6) వంటి కొన్ని బి విటమిన్( Vitamin B Supplements ) సప్లిమెంట్లు తలనొప్పి లక్షణాలను తగ్గిస్తాయని అనేక అధ్యయనాలు తేల్చాయి.
తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పుదీనా ఆకులు( Mint Leaves ) చాలా బాగా సహాయపడతాయి.పుదీనా ఆకుల నుంచి సారం తీసి నుదుటిపై అప్లై చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చాలా వేగంగా నొప్పి నుంచి ఉపశమనం పొందరు.
అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు పుదీనా టీ, అల్లం టీ, గ్రీన్ టీ వంటి హెర్బల్ టీలు తీసుకున్నా కూడా త్వరగా ఉపశమనం పొందుతారు.కోల్డ్ కంప్రెస్ ఉపయోగించి కూడా మీ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
కాటన్ క్లాత్ లేదా టవల్ లో ఐస్ క్యూబ్స్( Ice Cubes ) ను పెట్టడం వల్ల వాపు తగ్గుతుంది.నరాల ప్రసరణ మందగిస్తుంది.మరియు రక్త నాళాలను పరిమితం చేస్తుంది.ఇవన్నీ తలనొప్పి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఇక కంటి నిండా నిద్ర లేకపోయినా తలనొప్పి వస్తుంది.కాబట్టి రోజులో 7 నుంచి 8 గంటల నిద్రకు కేటాయించండి.