గత వారం రికార్డు స్థాయిలో రూపాయి మారకం విలువ తగ్గడంతో ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ), ప్రపంచ సామర్ధ్య కేంద్రాలకు (జీసీసీ) పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులకు( Foreign Investors ) లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.
రూపాయి పతనం( Rupee Value ) ఇలాగే కొనసాగితే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి.గతేడాది అక్టోబర్ 23న డాలర్‌తో( Dollar ) రూపాయి మారకం విలువ రూ.83.19గా ఉండగా.ఈ ఏడాది జనవరి 23న అది 3.79 శాతం తగ్గి రూ.86.47 శాతానికి చేరుకుంది.
రూపాయి విలువ తగ్గడం వల్ల డాలర్, పౌండ్ వంటి బలమైన కరెన్సీల నుంచి మారే పెట్టుబడిదారులకు ఆస్తి విలువ తగ్గుతుందని తెలిపారు.అదే రూపాయి బలపడినప్పుడు ఆస్తి విలువ పెరిగే అవకాశం కూడా వుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్( Anarock ) అంచనా వేసింది.
అధిక ఆస్తి విలువ, కరెన్సీ హెచ్చుతగ్గులు .పెట్టుబడి విలువను ప్రభావితం చేస్తుందని అనరాక్ గ్రూప్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రూపాయి విలువ తగ్గుతుండటం, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐలకు( NRI’s ) ఒక ముఖ్యమైన ప్రొత్సాహకంగా ఉంటుందని అనలిటిక్స్ సంస్ధ కేపీఎంజీ( KPMG ) పేర్కొంది.దీనికి తోడు భారత్‌లో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీల ఉనికి పెరగడం వల్ల ఆస్తి అద్దె, నిర్వహణ సేవలు క్రమబద్ధీకరించబడుతున్నాయి.విదేశాలలో నివసిస్తున్నప్పటికీ ఎన్ఆర్ఐల పెట్టుబడులను సమర్ధవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.అయితే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల( Real Estate Investments ) సమయంలో రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి ఖర్చులు ఉంటాయని నిపుణులు తెలిపారు.

రూపాయి విలువ తగ్గడాన్ని హై ఎండ్ లగ్జరీ రెసిడెన్షియల్ విభాగంలోని ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు అనుకూలంగా చూస్తారని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ డాని అన్నారు.దీని వల్ల భారతదేశంలో జీసీసీ పెట్టుబడి అవకాశాలు మరింత పెరగడంతో పాటు బలమైన డాలర్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేటీ ఈక్విటీ / సంస్థాగత పెట్టుబడుల ప్రవాహాలలో మెరుగుదలకు దారి తీస్తుందని అనికేత్ చెప్పారు.రూపాయి విలువ క్షీణత ఉక్కు, సిమెంట్ వంటి ఇన్‌పుట్ ఖర్చులపై ఒత్తిడిని కలిగిస్తుందని సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మూలధన వ్యయంపైనా ఒత్తిడిని తీసుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.