తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) లాంటి స్టార్ హీరో సైతం ప్రయత్నం మంచి సినిమాలైతే చేస్తున్నాడు… ఏక ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు ఈ వార్తల మీద ఎలాంటి క్లారిటి రానప్పటికి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రాబోతుందనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి సంపత్ నంది ప్రస్తుతానికైతే ‘ఓదెల 2’( Odela 2 ) అనే సినిమాకి కథ మాటలు అందిస్తు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా( Gaanja Shankar ) ఆగిపోయినట్టుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు బహిరంగంగా తెలియజేయడం విశేషం… ఇక దాంతో ఆయన నాగార్జున ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమా ఎక్కడి వరకు వచ్చిందనే దాని మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది అంటూ సోషల్ మీడియా మొత్తం వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం సంపత్ నంది అంటే రొటీన్ రొట్ట సినిమాలు చేస్తూ ఉంటాడు.కాబట్టి అతనికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు అంటు మరి కొంత మంది కామెంట్స్ చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సంపత్ నంది లాంటి డైరెక్టర్ ఇప్పుడు తప్పకుండా ఒక సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.లేకపోతే మాత్రం ఆయన కెరియర్ భారీగా ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి…
.