సాధారణంగా చాలా మందికి మోచేతుల వద్ద స్కిన్ అనేది రఫ్ గా మరియు డార్క్ గా( Dark Elbows ) ఉంటుంది.మోచేతుల చర్మం కాస్త మందంగా ఉండడం వల్ల అక్కడ మృతకణాలు నిలిచిపోతాయి.
ఇది చర్మం నల్లబడడానికి కారణమవుతుంది.అలాగే మోచేతులను టేబుల్ పై రుద్దడం, ఎండల ప్రభావం, మోచేతులను సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, డ్రై నెస్ తదితర కారణాల వల్ల కూడా మోచేతులు నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి.
ఈ క్రమంలోనే నల్లగా ఉన్న మోచేతులను కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.కానీ ఆ నలుపును పోగొట్టుకునేందుకు పెద్దగా ప్రయత్నించారు.
అయితే మోచేతుల నలుపును సహజంగా పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.ఈ రెమెడీని పాటిస్తే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.అందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్ లో సగం వరకు హాట్ వాటర్ తీసుకోవాలి.ఆపై అందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి,( Besan Flour ) హాఫ్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టీ స్పూన్ రెగ్యులర్ షాంపు మరియు వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం ఒక బంగాళదుంప స్లైస్ ను తీసుకుని దానితో మోచేతులను సున్నితంగా రెండు మూడు నిమిషాల పాటు రబ్బింగ్ చేసి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను మోచేతులకు అప్లై చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుంది.మోచేతులు తెల్లగా మృదువుగా మారతాయి.అందంగా మెరుస్తాయి.అలాగే ఈ రెమెడీని అండర్ ఆర్మ్స్, నెక్, మెకాళ్లు మరియు పాదాల నలుపును వదిలించడానికి కూడా ఉపయోగించవచ్చు.