టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ ( Mythri Movie Makers, Dil Raju SVC Banner )ముందువరసలో ఉంటాయి.ఈ రెండు బ్యానర్లలో తెరకెక్కుతున్న సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను అందుకున్నాయి.
అయితే ఈ బ్యానర్లకు సంబంధించిన నిర్మాతలపై ఐటీ దాడులు జరగడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఈ ప్రముఖ నిర్మాణ సంస్థల నిర్మాతలు బాలీవుడ్ ప్రాజెక్ట్ ( Bollywood project )లతో సైతం బిజీ అవుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.
టాలీవుడ్ సినిమాల విషయంలో ఒకింత కోపంతో రగిలిపోతున్న బాలీవుడ్ మాఫియా ఈ ఐటీ దాడుల వెనుక ఉందని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.బాలీవుడ్ లో ఎవరు ఎదగాలన్నా ఎవరిని తొక్కాలన్నా అక్కడి మాఫియాకు సాధ్యం అనే గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి.

బాలీవుడ్ సౌత్ సినిమాలు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలోనే ఈ ఐటీ దాడులు( IT attacks ) జరిగాయనే ప్రచారం జరుగుతోంది.బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకునే సంస్థలకు వార్నింగ్ బెల్ గా ఈ ఐటీ దాడులు జరిగాయనే ప్రచారం సైతం జరుగుతుండటం గమనార్హం.ఆదాయపు పన్ను శాఖ అధికారులు వైరల్ అవుతున్న వార్తల గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడరు.

నిర్మాత దిల్ రాజు సైతం ఐటీ దాడులు రొటీన్ గానే జరిగాయనే అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు.అయితే తెర వెనుక ఏం జరగకుండా ఇంత అకస్మాత్తుగా ఐటీ దాడులు జరగవనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పెద్ద సినిమాల కలెక్షన్ల పోస్టర్ల వల్లే ఈ ఐటీ దాడులు జరిగాయని కొంతమంది మీడియా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఐటీ దాడులు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.