టాలీవుడ్ దర్శకద్రుడు ఎస్ఎస్ రాజమౌళి,( Rajamouli ) మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నారు మహేష్ బాబు రాజమౌళి.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా నటించనుంది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్( Priyanka Chopra Remuneration ) గురించి పెద్ద చర్చ నడుస్తోంది.ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగారు.
అయితే అదే సమయంలో ఆమె హాలీవుడ్ లో( Hollywood ) అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్ లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం ఆమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు.అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం.ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న ది స్కై ఈజ్ పింక్ చిత్రం 2019లో విడుదలైంది.
బాలీవుడ్‌లో ఇదే ఆమె చివరి సినిమా.బాలీవుడ్‌కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది.
టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకొనే తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ.20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి.అయితే SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.కానీ హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ.40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి.ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
మరి ఇందులో నిజానిజాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ప్రియాంక చోప్రా కు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఇది చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో నటిస్తోంది కాబట్టి హిందీ బెల్ట్ లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ కూడా ఉంది.ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది.SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్‌లో జక్కన్న ప్లాన్ చేశాడు.దీంతో సులువుగా అక్కడి మార్కెట్ కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది.
ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్.ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు కూడా మారిపోతాయి.
ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.