తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.మరి ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుండడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన రీసెంట్ గా మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించాడు.
మరి ఈ పూజా కార్యక్రమాలకు ఎవ్వరిని రానివ్వకుండా కేవలం రాజమౌళి, మహేష్ బాబు ( Rajamouli, Mahesh Babu )ఇద్దరు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మరి ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అనుకుంటే ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ప్రియాంక చోప్రాలతో( Priyanka Chopra ) రాజమౌళి ఒక వర్క్ షాప్ ని కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వర్క్ షాప్ ను కండక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారట.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో రాజమౌళి భారీ విజయాన్ని సాధించడమే కాకుండా 3000 కోట్ల కలెక్షన్లను( 3000 crore collections ) రాబట్టలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగినట్లయితే రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.మరి ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో సినిమాలను చేసి భారీ విజయాలను సాధించిన దర్శకులు ఎవ్వరూ లేరు.ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ ని కూడా మూట గట్టుకోకుండా వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ రావడం అనేది ఒక రాజమౌళికి మాత్రమే చెల్లిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.