సాధారణంగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్కో సినిమాకి హీరో క్రేజ్ అంతకంతకూ పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.అంతేకాదు వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటారు.
కానీ గోపీచంద్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.ఒకప్పుడు వరుస సినిమాలతో హిట్టు కొట్టిన గోపీచంద్ ఇటీవల కాలంలో మాత్రం సరైన కమర్షియల్ హిట్ కొట్టలేకపోతున్నాడు.
అలా అని అతనికి టాలెంట్ లేదా అంటే విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగిన గోపీచంద్ ఎలాంటి పాత్రలోనైనా చేయగలడు.గత కొంత కాలం నుంచి ప్రేక్షకులను నవ్వించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నాడు.
మిగతా హీరోలు సక్సెస్ రేటు తో దూసుకుపోతుంటే గోపీచంద్ మాత్రం ప్రతి సినిమాకి అంతకంతకూ వెనుకబడి ఉన్నాడు అని చెప్పాలి.టాలెంట్ ఉన్న అతను ఎంచుకున్న కథల వల్లే అతను ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.2001 లో తొలి వలపు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.
జయం,నిజం, వర్షం సినిమాలతో విలన్ గా నటించిన ఒక్కసారి గా మంచి గుర్తింపు వచ్చి పడింది.ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి యజ్ఞం, ఆంధ్రుడు, రణం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
దీంతో మాస్ ప్రేక్షకులు గోపీచంద్కు బ్రహ్మరథం పట్టారు.
ఇదే జోష్ లో లక్ష్యం ,శౌర్యం ఇలాంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకొని మంచి ఫాంలోకి వచ్చాడు.2009 నుంచి మాత్రం గోపీచంద్ తడబడుతూ వస్తున్నాడు అని చెప్పాలి.మధ్యలో వచ్చిన లౌక్యం సాలిడ్ విజయాన్ని అందించగా.
ఆ తర్వాత ఏ సినిమా కూడా అటు గోపీచంద్ కు కమర్షియల్ విజయాన్ని అందించలేకపోయింది.ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా కమర్షియల్ కూడా కమర్షియల్గా నిర్మాతలకు కలిసిరాలేదు అన్నది తెలుస్తుంది.
అయితే గోపీచంద్ కి అటు స్టార్ డైరెక్టర్తో సినిమాలు పడకపోవడం కూడా అతని కెరీర్ కు మైనస్ గా మారిపోతుంది అని తెలుస్తోంది.ఇంకా అవకాశం వస్తే మళ్లీ విలన్ గా నటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని గోపిచంద్ చెప్పుకొచ్చాడు.
అయితే గోపీచంద్ కెరీర్ నిలబడాలంటే మాత్రం ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఒక దర్శకుడు గోపీచంద్ కి అవకాశం ఇవ్వాలి అన్నది ప్రస్తుతం అభిమానులు అనుకుంటున్న మాట.