నా ఇల్లు. మహా నటుడు చిత్తూర నాగయ్య నటించిన అద్భుత చిత్రం.
ఈ సినిమాకు స్వయంగా ఆయనే దర్శకత్వం వహించారు.ఈ సినిమాకు ముందు రేణుకా ఫిలిమ్స్ బ్యానర్ పై త్యాగయ్య లాంటి మరుపురాని చిత్రాన్ని తెరకెక్కించాడు.
క్లాసికల్ మూవీగా రూపొందిన ఈ సినిమా తొలి ప్రయత్నంగానే ఆయన చక్కటి విజయాన్ని అందుకున్నాడు.ఈ సినిమా అనంతరం రెండో ప్రయత్నంగా ఆవర్ ఇండియా బ్యానర్ పై నా ఇల్లు అనే సినిమా తీశారు.
ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే సమకూర్చుకునన్నాడు.అయితే నాగయ్యకు అద్దేపల్లి రామారావు సంగీత సహకారం అందించారు.
తెలుగు, తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో టి ఆర్ రాజ కుమారి హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమాలో బ్యాంకు ఉద్యోగి శివరామ్ క్యారెక్టర్ చేశాడు నాగయ్య.
ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు.భార్య భర్తలకు సంగీతం అంటే ప్రాణం.
తమ పిల్లలకు కూడా సంగీతాన్ని నేర్పించాలి అనుకుంటారు.ధనరాజ్ అనే మోసకారి పన్నాగంలో భాగంగా లీల అనే లేడీ మాయలో పడతాడు నాగయ్య.
అంతేకాదు.బ్యాంకు డబ్బును పోగొడతాడు.
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు అవుతుంది.జైల్లోకి వెళతాడు.
ఆయన జైలు నుంచి వచ్చే సరికి తన కుటుంబం కనిపించదు.జీవించడం కోసం పాకీ పని చేసేందుకు రెడీ అవుతాడు నాగయ్య.
ఈలోగా బాలానంద సంఘం సహకారంతో పిల్లలు ప్రయోజకులు అవుతారు.దుర్మార్గుడి మోసం బయటకు తెలిసి అందరూ బాధపడతారు.
చివరకు నాగయ్య తన కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోసంగా జీవితాన్ని గడుపుతాడు.దీంతో సినిమా ఎండ్ అవుతుంది.

అప్పట్లో ఈ సినిమా పాటలు సంచలన విజయం సాధించాయి.దేవులపల్లి కృష్ణశాస్త్రి అందించిన సాహిత్యం ఈ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది.పలు పాటలు సంగీత ప్రియులను ఎంత ఆకట్టుకున్నాయి.సినిమా విడుదలైన తర్వాత చాలా కాలం పాటు ఈ సినిమా పాటలను జనాలు పాడేవారు.ఈ సినిమాలో ప్రత్యేక విశేషం ఒకటుంది.ముంబైలలో జరుగుతున్న కథకు అనుగుణంగా రెండు హిందీ పాటలు పెట్టారు.
తెలుగు సినిమ చరిత్రలో హిందీ పాటలు పెట్టడం అదే తొలిసారి.ఈ రెండు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ సాధించి.
అందరి చేత ప్రశంసలు అందుకున్నాయి.నాగయ్య సంగీతానికి సర్వత్ర అభినందనలు వెల్లువెత్తాయి.