ఛారిటీ సంస్థకు విరాళం అందించడంతో పాటు యువతకు స్పూర్తిగా నిలవడానికి తన అనారోగ్య సమస్యను సైతం అధిగమించి ఏకంగా 508 కిలోమీటర్లు నడిచారో పెద్దాయన.బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన గుర్మీత్ సింగ్ సిద్ధూ( Gurmeet Singh Sidhu ) ‘‘గోయింగ్ ది డిస్టెన్స్ ’’( Going the Distance ) విభాగంలో మూవంబర్ యూకే అండ్ యూరప్ అవార్డ్ 2025కు( UK and Europe Award 2025 ) గాను విజయం సాధించాడు.
ఏకంగా 508 కిలోమీటర్లు నడిచి ఈ అవార్డును దక్కించుకున్నారు.మూవంబర్ ఛారిటీ( Movember Charity ) అనేది పురుషుల ఆరోగ్య సమస్యలపై ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేదానికి గాను వార్షిక ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
గ్రేవ్‌సెండ్ గ్రామర్ స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న వాకింగ్ సింగ్ గుర్మీత్( Walking Singh Gurmeet ) ఈ ఏడాది తన విద్యార్ధులకు ప్రేరణగా నిలవాలని నిర్ణయించుకున్నారు.ఆరోగ్య సమస్యల కారణంగా అతను కొద్దిరోజులుగా నడవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయినప్పటికీ శస్త్రచికిత్సను నివారించడానికి ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం , నడవటం ద్వారా గుర్మీత్ తన అనారోగ్య సమస్యను అధిగమించారు.పోటీలో దాదాపు 508 కిలోమీటర్ల మేర నడిచారు గుర్మీత్.

ఈ ఛారిటీ పేరు మూవంబర్. ఇది నవంబర్ నెల అంతా కొనసాగుతుంది.ఈ సందర్భంగా ప్రజలు వివిధ కార్యక్రమాలలో పాల్గొని విరాళాలను( Donations ) సేకరిస్తారు.పురుషులకు మద్ధతుగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మార్చిలో విజేతను ఖరారు చేసే ముందు అవార్డ్ ప్యానెల్ అందరి విజయాలను విశ్లేషిస్తుందని సిద్ధూ చెప్పారు.

ప్రతిరోజూ పాఠశాల ముగిసిన తర్వాత, వారాంతాల్లో కలిసి నెల మొత్తం తాను 508 కిలోమీటర్లు నడిచానని , అంటే రోజుకు సగటున 17 కిలోమీటర్లు అని తెలిపారు.తన వెన్నుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని లేనిపక్షంలో తాను నడవలేకపోవచ్చునని కొన్నాళ్ల క్రితం ఓ న్యూరో సర్జన్ తనకు తెలిపారని గుర్మీత్ వెల్లడించారు.దానిని అధిగమించడానికే తాను ఇలా చేసి, విజయం సాధించానని గుర్మీత్ సింగ్ సిద్ధూ చెప్పారు.
యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి మారథాన్‌లు, అల్ట్రా మారథాన్‌లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.







