నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా చాలా బిజీగా గడుపుతున్నారు.బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తూ ఏమాత్రం తీరిక లేకుండా ఉన్నారు.
ఇటీవల రష్మిక వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇలా వరుస హిట్ సినిమాలతో అరుదైన రికార్డులను రష్మిక సొంతం చేసుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె మరో రికార్డు సొంతం చేసుకున్నారు.ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి రికార్డు( New Record ) నమోదు చేసుకోలేదని తెలుస్తోంది.మరి రష్మిక ఖాతాలో నమోదైన ఆ అరుదైన రికార్డు ఏంటి అనే విషయానికి వస్తే… ఇటీవల కాలంలో వరుస మూడు హిట్ సినిమాల ద్వారా ఏ ఒక్క హీరోయిన్ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్( Bollywood Boxoffice ) వద్ద 500 కోట్ల కలెక్షన్స్ రాబట్ట లేకపోయారట.మొదటిసారి రష్మిక నటించిన సినిమాలకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావటం విశేషం.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రష్మిక నటించిన యానిమల్,( Animal ) పుష్ప 2,( Pushpa 2 ) ఛావా ( Chhaava ) ఈ మూడు సినిమాలు ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు అయితే ఇప్పటివరకు ఈ రికార్డు ఏ హీరోయిన్ పేరు మీద నమోదు కాకపోవడం విశేషం.ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉంటూ అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ తగ్గేదేలే అంటూ రష్మిక దూసుకుపోతున్నారని చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు ధనుష్ కుబేర సినిమాలో కూడా నటిస్తున్నారు అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ లతో రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.







