మధుమేహంతో( diabetes ) బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది భారీగా పెరిగిపోతుంది.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు.
ప్రతి పదిమందిలో ఆరుగురు మధుమేహం బాధితులు ఉంటున్నారు.నిశ్చలమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఊబకాయం తదితర అంశాలు మధుమేహానికి కారణం అవుతుంటాయి.
ఇకపోతే మధుమేహం వచ్చాక షుగర్ లెవల్స్( Sugar levels ) ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే గింజలు ఉత్తమంగా సహాయపడతాయి.
ఈ గింజలను డైట్ లో చేర్చుకుంటే రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మధుమేహుల్లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయగలిగే ఆ ఉత్తమ గింజలు ఏవో తెలుసుకుందాం పదండి.

మెంతులు( fenugreek ) రుచికి చేదుగా ఉన్న ఆరోగ్యానికి మాత్రం అపారమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి.ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ లో పావు టీ స్పూన్ మెంతుల పొడిని కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.ఊబకాయం సమస్య దూరం అవుతుంది.అలాగే మధుమేహం ఉన్నవారికి మేలు చేసే గింజల్లో గుమ్మడి ఒకటి.గుమ్మడి గింజలు( Pumpkin seeds ) ప్రోటీన్ కు గొప్ప మూలం.ఇది మధుమేహం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా వచ్చే చిక్కులను నివారిస్తుంది.

డయాబెటిక్ రోగులకు చియా విత్తనాలు( Chia seeds ) కూడా ఆరోగ్యకరమైన ఆహారం.గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున, అవి రక్తంలో చక్కెరను పెంచవు.ఫైబర్, ప్రొటీన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన చియా గింజలు హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, ఎముకల బలహీనత మొదలైన ఆరోగ్య సమస్యలకు వ్యతిరేకంగా పోరాడతాయి.ఇక జీలకర్ర మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది.
జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది.ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పైగా జీలకర్ర ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సైతం తోడ్పడుతుంది.