జీలకర్ర(జీరా), ఆపిల్ సైడర్ వెనిగర్.ఈ రెండూ ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారు ఖచ్చితంగా తమ రెగ్యులర్ డైట్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్, జీలకర్ర లను చేర్చుకుంటారు.అయితే ఈ రెండు విడి విడిగా కంటే కలిపి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
మరి లేట్ ఎందుకు జీలకర్ర, ఆపిల్ సైడర్ వెనిగర్ లను కలిపి ఎలా తీసుకోవాలి.? అసుల ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే ఏయే ప్రయోజనాలు లభిస్తాయి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ఒక గ్లాస్ వాటర్‌లో రెండు స్పూన్ల జీలకర్ర వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే నీటిని వడబోసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసుకుని సేవించాలి.ఇలా ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోయి.వెయిట్ లాస్ అవుతాయి.
అదే సమయంలో బాడీలోని వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయి కిడ్నీలు శుభ్ర పడతాయి.
అలాగే జ్ఞాపకశక్తి పెంచడంలోనూ ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది.
రోజూ ఉయదాన్ని ఖాళీ కడుపుతో జీరా, ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్‌ను తీసుకుంటే మెదడు కణాలు చురుగ్గా మారతాయి.ఫలితంగా జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెండూ అద్భుతంగా పెరుగుతాయి.
అంతే కాదు, జీరా- ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్‌ను డైలీ డైట్‌లో చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కఫం వంటి సమస్యలు ఉంటే.వాటి నుంచి విముక్తి లభిస్తుంది.నిద్ర లేమి సమస్య క్రమంగా దూరం అవుతుంది.మరియు చర్మంపై తరచూ మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కూడా ఉంటాయి.