సినిమాల్లో థ్రిల్లర్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది.థ్రిల్లర్ సినిమాలు( Thriller Movies ) ఇష్టపడని వారు ఉండరు.
ఈ సినిమాలు చూసేటప్పుడు ఆ ఫీల్ కూడా వేరేలా ఉంటుంది.నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు ఇలా ఎన్నో ఉంటాయి ఈ థ్రిల్లర్ సినిమాల్లో.
థ్రిల్లర్ సినిమాలు తీయడం కూడా అంత ఈజీ కాదు.ఆడియన్స్ ని టెన్షన్ పెట్టె సీన్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ఎన్నో చూసుకోవాలి.మరి ప్రేక్షకులను ఎక్కువగా థ్రిల్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్షణక్షణం:
రాంగోపాల్ గురించి చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు రాంగోపాల్ వర్మ చేసే సినిమాలు అంటే భారీ అంచనాలు ఉండేవి.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు అందించాడు.ఇక రాంగోపాల్ వర్మ చేసిన సినిమాల్లో క్షణక్షణం( Kshanakshanam Movie ) ఎప్పటికి గుర్తుండిపోతుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఈ సినిమా సత్య అనే యువతి, చందు అనే చిన్న దొంగ మధ్య సాగే థ్రిల్లర్.ఈ సినిమాలో వెంకటేష్, శ్రీదేవి నటించారు.
ఈ సినిమాలో అద్భుతమైన సస్పెన్స్ ఉంటుంది.ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హై లైట్ అనే చెప్పాలి.

అనుకోకుండా ఒక రోజు:
ఈ సినిమా ఎప్పుడు చూసిన బోర్ కొట్టదు అనే చెప్పాలి.అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఛార్మి ( Charmi ) కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ అనే చెప్పాలి.బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి.ఈ సినిమా సహస్ర (చార్మీ కౌర్) అనే యువతి జీవితంలో అనుకోకుండా ఒకరోజు ఏమి జరిగింది అనే దాని చుట్టూ తిరుగుతుంది.అద్భుతమైన స్క్రీన్ ప్లే, కథతో ఈ సినిమా థ్రిల్ కి గురిచేస్తుంది.

ఎవరు:
బెస్ట్ థ్రిల్ సినిమాల్లో ఎవరు( Evaru Movie ) కచ్చితంగా ఉంటుంది.ఎన్నో మలుపులతో ఈ సినిమా థ్రిల్ కి గురిచేస్తుంది.హత్య విచారణ, వెలుగులోకి వచ్చిన ఊహించని విషయాలు చుట్టూ తిరుగుతుంది.దీనికి అడవి శేష్ అద్భుతమైన నటన కూడా యాడ్ అవ్వడంతో, రెజీనా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
స్క్రీన్ ప్లే, కథ, పెర్ఫార్మన్స్ లతో ఎవరు బెస్ట్ థ్రిల్లర్ గా నిలిచింది.

నేనొక్కడినే:
మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ ఎక్స్పరిమెంట్, బెస్ట్ థ్రిల్ సినిమాల్లో నేనొక్కడినే( Nenokkadine ) ఒకటి.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఒక సింగర్ గా మహేష్ బాబు, తల్లితండ్రుల కోసం కొడుకు ఆరాటం, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
ఈ సినిమా ప్రేక్షకులకు ఒక థ్రిల్ లోకి తీసుకెళ్తుంది.

యు టర్న్:
ఈ సినిమా ఒక న్యాచురల్ థ్రిల్లర్.సమంత( Samantha ) అద్భుతమైన పెర్ఫార్మన్స్, పవన్ కుమార్ దర్శకత్వం ఈ సినిమాకి ప్లస్ పాయింట్.టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా యు టర్న్( U Turn Movie ) దగ్గర జరుగుతుంది.
ఊహించని మలుపులతో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి థ్రిల్లర్ గా ఈ సినిమా నిలిచింది.

విరూపాక్ష:
తాజాగా వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో విరూపాక్ష( Virupaksha Movie ) ఒకటి.తక్కువ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.మంచి వసూళ్లను తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో సంయుక్త అద్భుతమైన నటనతో భయపెట్టింది.బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో విరూపాక్ష కచ్చితంగా ఉంటుంది.







