అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తన కుమారుడిని ఎమ్మెల్యే చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డిని చంపాలనుకుంటున్నారని ఆరోపించారు.
బెడ్ పై ఉన్న తన సోదరిని కూడా చంపాలనుకున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు.ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్న ఆయన ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పుడు దివాకర్ రెడ్డిని చంపి సానుభూతి పొందాలనుకుంటున్నారని పేర్కొన్నారు.అందుకే జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి రావాలంటే భయపడుతున్నారని వెల్లడించారు.
జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో కాంపౌండ్ నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు.కాలేజీ గ్రౌండ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు.
జేసీకి పది నెలలు టైం ఉందన్న ఆయన ఆ తరువాత తట్టాబుట్టా సర్దుకుని పోతాడని స్పష్టం చేశారు.







