రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, పోషకాల కొరత, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం మద్యపానం (Pollution, nutritional deficiencies, work stress, eating habits, smoking, alcohol consumption)వంటి చెడు వ్యసనాలు, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల కొందరు తీవ్రమైన హెయిర్ ఫాల్(Hair Fall) తో బాధపడుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే ఇకపై జుట్టు రాలే సమస్యతో అస్సలు బాధపడొద్దు.ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ (Hair tonic)ను కనుక తయారు చేసుకుని వాడితే ఎంతటి తీవ్రమైన హెయిర్ ఫాల్ సమస్యకైనా సులభంగా చెక్ పెట్టవచ్చు.
టానిక్ తయారీ కోసం ముందుగా మూడు ఉసిరికాయలను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్(Mix jar) తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు(Ginger slices), మూడు రెబ్బలు కరివేపాకు (curry leaves)మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం (Castor oil)వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ టానిక్ ను వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అన్నారు.
ఉసిరి, అల్లం, కరివేపాకు జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి.జుట్టు రాలే సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.

అలాగే ఇప్పుడు చెప్పుకున్న హోమ్ మేడ్ టానిక్ కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.కురులను ఒత్తుగా మారుస్తుంది.అంతే కాదండోయ్ ఈ టానిక్ ను వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.కురులు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.







