తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.తేజ సజ్జా( Teja Sajja ) లాంటి హీరో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు.
ఆయన చేసిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి.

ఇక ప్రస్తుతం ఆయన మిరాయ్( Mirai ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియాలో( Pan India ) మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యావత్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా మిరాయ్ సినిమాతో ఒక విజువల్ వండర్ ని స్క్రీన్ మీద ఆవిష్కరించబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి ఈ సినిమాతో నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కబోతున్నడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఇకమీదట ఆయనకు తిరుగుండదనే చెప్పాలి.

మరి అలాంటి నటుడు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగాలి అనే దాని మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు… ఇక ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటు ఒక భారీ ఇమేజ్ ను సొంతం చేయుకోవాల్సిన అవసరం అయితే ఉంది…
.







