టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సక్సెస్ రేట్ పరవాలేదనే స్థాయిలో ఉండగా మిడిల్ రేంజ్ హీరోలు, యంగ్ హీరోలకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు.మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది హీరోలు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ హీరోలకు ఎప్పుడు సక్సెస్ దక్కుతుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు.కొందరు హీరోలు వరుస ఫ్లాప్స్ తో కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మాస్ మహారాజ్ రవితేజకు( Ravi Teja ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.రవితేజ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
రవితేజ కెరీర్ లో ఈ మధ్య కాలంలో ధమాకా మినహా మరో హిట్ లేదు.ధమాకా సినిమాకు ముందు ధమాకా సినిమా తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఈ హీరో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మరో హీరో శర్వానంద్( Sharwanand ) పరిస్థితి మరింత దారుణంగా ఉంది.గతంతో పోలిస్తే ఈ హీరోకు మూవీ ఆఫర్లు సైతం తగ్గాయనే సంగతి తెలిసిందే.శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరో హీరో గోపీచంద్( Gopichand ) పరిస్థితి మరింత దారుణంగా ఉంది.వరుసగా మాస్ సినిమాలలో గోపీచంద్ నటిస్తున్నారు.

అయితే గోపీచంద్ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రావడం లేదనే చెప్పాలి.మరో హీరో సుధీర్ బాబు( Sudheer Babu ) సైతం కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ హీరో క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నా ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదు.టాలీవుడ్ హీరోల పారితోషికాలు అంతకంతకూ పెరుగుతుండగా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు.







