టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) గురించి మనందరికీ తెలిసిందే.సీనియర్ హీరో అయిన వెంకీ మామ ఇప్పటికి అదే ఊపులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు వెంకటేష్.అందులో భాగంగానే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు వెంకీ మామ.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే ఇప్పుడు వెంకీ మామతో మరో డైరెక్టర్ సినిమా చేయాలని భావిస్తున్నారట.ఆ డైరెక్టర్ ఎవరు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.డైరెక్టర్ వి.వి.వినాయక్( Director VV Vinayak ) గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే.ఒకప్పుడు మంచి మంచి సినిమాలను దొరికేక్కించిన వివి వినాయక్ చాలా కాలం పాటు గ్యాప్ ఇచ్చారు.
అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు మళ్లీ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా వెంకటేష్ కి వినాయక్ ఒక కథ చెప్పాడని, వెంకటేష్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందో గానీ, వినాయక్ సినిమా పై మాత్రం ఎప్పటి నుంచో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.ఈ సినిమాను నల్ల మలుపు బుజ్జి నిర్మించవచ్చని తెలుస్తోంది.ఈ ముగ్గురి కాంబినేషన్ లో 2006 లో వచ్చిన లక్ష్మీ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.లక్ష్మీ సినిమా తర్వాత వీరి ముగ్గురి కాంపోలో మళ్లీ సినిమా రాలేదు.దానికి తోడు వినాయక్ కూడా సరైన సక్సెస్ ట్రాక్ లో లేడు.అందుకే ఎలాగైనా సక్సెస్ ను కొట్టాలనే కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం పని చేస్తున్నాడట.
మరి వెంకటేష్ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి కథ రాశాడో చూడాలి మరి.





 

