ములుగులో( Mulugu ) జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క( Minister Sitakka ) పాల్గొని, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కీలక పాత్ర పోషించారు.
మంత్రిగారితో పాటు విద్యార్థులు, యువతీయువకులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.ముఖ్యంగా, డీజే టిల్లు పాటకు సీతక్క స్టెప్పులేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎల్లప్పుడూ బిజీగా ఉండే సీతక్క డాన్స్ చేయడంతో కోలాహలం వాతావరణంతో ఉత్సాహంగా మారింది.
రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 3K రన్ నిర్వహించారు.ఈ రన్‌లో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు.ములుగు ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇకపోతే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలు చేస్తే అధికారులు శిక్షించబడతారని మంత్రి సీతక్క స్పష్టంగా చెప్పారు.ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సస్పెన్షన్ మాత్రమే కాదు, అవసరమైతే ఉద్యోగం నుండి తొలగిస్తామని ఆమె తెలిపారు.మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై మంత్రిగారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠకు మైనస్ చేస్తున్న అధికారులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ములుగులో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ( Panchayat Raj, Rural Development Department )ఉద్యోగులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మంత్రి సీతక్క ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ సిస్టమ్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.ఈ విధానం ద్వారా ఇకపై సచివాలయానికి ఉద్యోగులు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వారి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.సిబ్బంది సర్వీస్ మ్యాటర్, ఫైల్స్ పెండింగ్‌లో పెట్టకూడదని, వాటిని వెంటనే క్లియర్ చేయాలని ఆమె సూచించారు.
ఈ సందర్బంగా ములుగు ప్రాంత ప్రజలు మంత్రి సీతక్క నాయకత్వాన్ని ప్రశంసించారు.ఆమె ప్రజల క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, అవినీతి అధికారులను కట్టడి చేయడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటుండటం ప్రజల మన్ననలు పొందింది.