ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే రామ్ చరణ్ వంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇంతకు ముందు ఆయన చేసిన ‘ ఆచార్య’ , ‘గేమ్ చేంజర్’ ( ‘Acharya’, ‘Game Changer’ )రెండు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఆయన మార్కెట్ కొంతవరకు తగ్గింది.

మరి ఇప్పుడు ఆయన మంచి సినిమాలను చేసి తద్వారా తన అభిమానులను ఆనందింప చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుంది.తద్వారా ఈ సినిమాతో అటు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియాలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు నచ్చాలంటే మాత్రం ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి కథ కూడా ఉండాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్బీర్ కపూర్ ( Ranbir Kapoor )తో ఒక చిన్న క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఆయన క్యారెక్టర్ దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఉండే విధంగా లో ఆడ్ చేశారట.రణబీర్ కపూర్ ని కూడా అడిగి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా సమాచారమైతే అందుతుంది.మరి ఏది ఏమైనా కూడా ‘అనిమల్’ సినిమా తర్వాత తెలుగులో కూడా ఆయనకి మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.కాబట్టి ఈ సినిమా మీద అటు బాలీవుడ్ లోనూ, ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.