దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తాజా సమావేశంలో ప్రారంభించబడిన గ్లోబల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కౌన్సిల్ (జీఏసీసీ)లో భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా సినీ నిర్మాత అనంత్ సింగ్ చోటు దక్కించుకున్నారు.వర్ణ వివక్ష, హెచ్ఐవీ/ ఎయిడ్స్ , లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పలు చిత్రాలను తీసిన సింగ్ ఎంతోమంది ప్రశంసలు దక్కించుకున్నారు.
దివంగత దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా బయోపిక్ ‘‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’’ ఇలాంటి వాటిలో ఒకటి.అనంత్ సింగ్‌కు 2001లో డబ్ల్యూఈఎఫ్ క్రిస్టల్ అవార్డ్ లభించింది.
సృజనాత్మ సమాజం, మానవత్వం గురించి చెప్పే సంరక్షకులు కళాకారులని అనంత్ సింగ్( Anant Singh ) అన్నారు.లక్షలాది మందికి తోడ్పడటానికి కళాకారుల స్వరం, వ్యక్తీకరణలు వినిపించాల్సిన అవసరం ఉన్నప్రపంచంలో జీఏసీసీ ముఖ్యమైనది ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, ఇతర ప్రముఖులతో సహా ఆయన కౌన్సిల్‌కు నియమితులయ్యారు.షర్మీన్ బబైద్ – చినోయ్, జార్జ్ ఓస్బోర్న్ (బ్రిటీష్ మ్యూజియం చైర్), రెనీ ఫ్లెమింగ్ (ప్రపంచ ప్రఖ్యాత సోప్రానో), హానీ ఉల్రిచ్ ఒబ్రిస్ట్ (సర్పెంటైన్ గ్యాలరీ ) తదితరులు ఈ కౌన్సిల్‌లో ఉన్నారు.

పారిశ్రామిక యుగం నుంచి మరింత తెలివైన, పరస్పరం అనుసంధానించబడిన సమాజంగా ప్రపంచం మారుతున్న దశలో జీఏసీసీ స్థాపించబడిందని వ్యవస్ధాపకులు తెలిపారు.కళలు, సాంస్కృతిక రంగంతో నూతన యుగాన్ని రూపొందంచడానికి సృజనాత్మకతను ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

కాగా.అనంత్ సింగ్.దక్షిణాఫ్రికాలో వీడియో విజన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని నెలకొల్పడంతో పాటు కేప్‌టౌన్ ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేశారు.ఈ స్టూడియోలు ఏడాదికి 7 బిలియన్ ర్యాండ్‌ల ఆదాయాన్ని అందుకున్నాయి.
తద్వారా దక్షిణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థకు 100 బిలియన్ ర్యాండ్‌లకు పైగా సమకూరింది.ఇందుకు గాను 2022లో ‘‘South Africa Investment Conference Business Award’’కు ఎంపికయ్యారు.
ఈ మేరకు అధ్యక్షుడు సిరిల్ రాంఫోసా నుంచి అవార్డును అందుకున్నారు అనంత్ సింగ్.