ప్రస్తుత రోజుల్లో మధుమేహం ( diabetes )అనేది చాలా కామన్ సమస్యగా మారిపోయింది.ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ పేషెంట్ ఉంటున్నారు.
మధుమేహం తలెత్తడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండనప్పటికీ.దాదాపు అందరికీ షుగర్ లెవెల్స్ ను నియంత్రించుకోవడం పెద్ద సవాలుగా మారుతుంటుంది.
అయితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండాలంటే మంచి ఆహారంతో పాటు శరీరానికి శ్రమ కూడా ఎంతో అవసరం.అందుకే నిత్యం వ్యాయామం చేయమని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు.
ఈ నేపథ్యంలోనే షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాల( Exercises ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది వాకింగ్.
( walking ) ఇది చాలా ఈజీగా ఉంటుంది.మధుమేహం ఉన్నవారినికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది.
నిత్యం 30 నుంచి 60 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి రావడమే కాకుండా అధిక శరీర బరువు నుంచి బయటపడతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఒత్తిడి దూరమవుతుంది.

అలాగే మధుమేహులకు స్విమ్మింగ్ ( Swimming )కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.స్విమ్మింగ్ ఎంత ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలపై ఒత్తిడి పడేలా చేస్తుంది.అదనపు కొవ్వును కరిగించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి స్విమ్మింగ్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

డాన్స్ ( Dance )కూడా ఒక వ్యాయామం లాంటిదే.ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని కనీసం ఒక అరగంట పాటు డాన్స్ చేశారంటే బ్రెయిన్ చాలా ప్రశాంతంగా మారుతుంది.ఒత్తిడి దూరమవుతుంది.షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.ఇక డయాబెటిక్ పేషెంట్స్ సైక్లింగ్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.నిత్యం అరగంట పాటు సైక్లింగ్ చేస్తే మీ గుండె ఆరోగ్యం, రక్తనాళాల పనితీరు మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.సైక్లింగ్ ఆరోగ్యకరమైన శ్వాస వ్యవస్థను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.