భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని( 76th Republic Day ) పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి.గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు ప్రతీ చోటా మువ్వన్నెల జెండా పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరిపారు.
ప్రతి ఊరు, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా, ప్రజలు దేశభక్తిని ప్రకటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.విద్యార్థులు, యువత తమ ప్రతిభతో ఆకట్టుకోగా, కొన్ని చోట్ల వీఐపీల సైతం తమ ప్రత్యేక శైలిలో వేడుకల్లో పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ( Krishna District Collector DK Balaji ) దంపతులు గణతంత్ర వేడుకల సందర్భంగా అందర్నీ ఆకట్టుకున్నారు.కలెక్టర్ బాలాజీ తన భార్యతో కలిసి ప్రముఖ సినిమా పాట “బుజ్జమ్మా బుజ్జమ్మా” పాటకు( Bujjamma Bujjamma Song ) అదిరిపోయే స్టెప్పులు వేశారు.వారి డ్యాన్స్‌ను చూస్తున్న అందరూ మంత్రముగ్ధులయ్యారు.ఈ డ్యాన్స్( Dance ) వీడియోను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది.
కలెక్టర్ బాలాజీ దంపతుల అందమైన హావభావాలు, ఉత్సాహపూరిత నృత్యం నెటిజన్లను ఆకట్టుకుంది.
గణతంత్ర వేడుకల్లో అదరగొట్టిన కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ మరో ముఖ్యమైన ఘనతను సొంతం చేసుకున్నారు.2024 సంవత్సరానికి “బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు” ఆయనకు లభించింది.రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఈ అవార్డు కోసం ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గతేడాది సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ బాలాజీ అత్యుత్తమ సేవలందించినందుకు ఈ అవార్డు అందించబడింది.ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు.
డ్యాన్స్‌లో ఉత్సాహాన్ని చూపించిన కలెక్టర్ బాలాజీ, తన సేవల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నారు.గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన సందడి, ఉత్తమ పనితీరు అవార్డు ఈ రెండూ కలెక్టర్ బాలాజీని ప్రజల హృదయాలకు మరింత చేరువ చేశాయి.
ఈ వేడుకలతో కృష్ణాజిల్లా గణతంత్ర వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.