ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.అందులో కొన్ని ఓటీటీలో విడుదల అవుతుండగా మరికొన్ని థియేటర్లో విడుదల అవుతున్నాయి.
మరి ఈ వారం ఓటీటీ అలాగే థియేటర్లో విడుదల కాబోతున్న ఆ సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.విశాల్ హీరోగా నటించిన చిత్రం మదగజరాజ.
( Madha Gaja Raja ) అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ లు కూడా ఇందులో నటించారు.సుందర్ సి.దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే తెలుగులో విడుదల కానుంది.
తమిళంలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చిత్ర బృందం చెబుతోంది.
విజయ్ శంకర్,వరుణ్ సందేశ్, అప్సరా రాణి కలిసి నటించిన చిత్రం రాచరికం.( Racharikam ) సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది.అలాగే కె.వి ప్రవీణ్, పృథ్వీరాజ్, యషిక వైష్ణవి కలిసి నటించిన చిత్రం మహిష.( Mahisha Movie ) కె.వి ప్రవీణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది.
ఇకపోతే త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఐడెంటిటీ సినిమా( Identity Movie ) మలయాళం లో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
జనవరి 24న విడుదలైన ఈ సినిమా విడుదల ఈ వారం రోజులు కూడా కాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదల కాబోతోంది.ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో జనవరి 31వ తేదీ నుంచి మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
అలాగే పృథ్వీ, విస్మయ శ్రీ, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పోతుగడ్డ.( Pothugadda ) రక్ష వీరమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో జనవరి 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.లుక్కాస్ వరల్డ్ అనే హాలీవుడ్ మూవీ జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది స్నో గర్ల్2 అనే వెబ్‌సిరీస్ జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.
ర్యాంపేజ్ అనే హాలీవుడ్ మూవీస్ జనవరి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.అలాగే ట్రెబ్యునల్ జస్టిస్2 అనే వెబ్‌సిరీస్ జనవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రీచ్ అనే హాలీవుడ్ మూవీ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.ఫ్రైడే నైట్ లైట్స్ అనే హాలీవుడ్ మూవీ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.