జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నారా దేవాన్ష్( Nara Devansh ) ను ప్రశంసించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
నారా దేవాన్ష్ చెస్ పజిల్స్ ను పూర్తి చేయడంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్( World Book Of Records ) లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా దేవాన్ష్ కు అరుదైన ఘనత దక్కింది.
లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి దేవాన్ష్ కు ఈ ఘనత దక్కడం గమనార్హం.పవన్ కళ్యాణ్ తన పోస్ట్ లో నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో చెస్ పజిల్స్( Chess Puzzles ) పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ నారా దేవాన్ష్ ను మెచ్చుకోవడం పవన్ అభిమానులకు, టీడీపీ అభిమానులకు ఒకింత సంతోషాన్ని కలిగిస్తోంది.ఏకంగా 175 చెస్ పజిల్స్ ను పూర్తి చేసి నారా దేవాన్ష్ సంచలన రికార్డులను క్రియేట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను మాత్రం పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.