తమిళ హీరో ధనుష్( Dhanush ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
అలాగే మొన్నటి వరకు నయనతార విషయంలో వివాదం లో కూడా వార్తల్లో నిలిచారు ధనుష్.ఇకపోతే ధనుష్ చివరిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఈ సినిమా తెలుగులో మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో మరో హిట్టు కొట్టాలని చూస్తున్నారు ధనుష్.
ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర( Kubera Movie ) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం హీరో ధనుష్ తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.తమిళంలో కంటే తెలుగులో సినిమాలు పెట్టుబడులకు మంచి లాభాలను అందిస్తున్న నేపథ్యంలో ఆయన పారితోషికం గణనీయంగా పెరిగింది.
అయితే తమిళ నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంలో సంకోచం చూపుతుండగా టాలీవుడ్ నిర్మాతలు ధనుష్ తో సినిమాలు చేయడంలో ఆసక్తిని చూపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా యువ నిర్మాతతో ధనుష్ తన తదుపరి తెలుగు చిత్రంపై చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కు కూడా వెంకీ అట్లూరి( Venky Atluri ) దర్శకత్వం వహించనున్నట్లు టాక్.అయితే ఈ సినిమా కోసం ధనుష్ ఒకేసారి రూ.60 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఈ విషయం పట్ల నిర్మాతలు ఇంకా పాజిటివ్ గా స్పందించలేదని తెలుస్తోంది.
తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో తమిళ నటులు, ముఖ్యంగా ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి వారు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు.తెలుగు పరిశ్రమలో ధనుష్‌కు వస్తున్న ఆదరణ చూస్తే ఆయనకు టాలీవుడ్‌లో మరింత అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు.
కానీ నిర్మాతలు ధనుష్ పారితోషికంపై నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.