బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచిగా సక్సెస్ అందుకున్న వారిలో నటి దీపిక పదుకొనే( Deepika Padukone ) ఒకరు.నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ ముంబై వెళ్లి అక్కడ స్థిరపడి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
తను మాతృభాష అయిన కన్నడ చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య అనే సినిమా నటించి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన దీపిక పదుకొనే అనంతరం ముంబైకి వెళ్లి బాలీవుడ్ సినిమాలలో ప్రయత్నాలు చేస్తూ అక్కడ అవకాశాలను అందుకున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గ ఓ వెలుగు వెలుగుతున్న దీపిక పదుకొనే మరో నటుడు రణవీర్ సింగ్( Ranveer Singh ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇలా వీరి వివాహం తర్వాత వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారో అయితే గత ఏడాది సెప్టెంబర్ నెలలో దీపికా పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉంటూ తన బిడ్డ ఆలనా పాలన చూస్తూ మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
ఇలా బిడ్డ పుట్టిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా సభ్యసాచి 25వ ఫ్యాషన్ షోకు హాజరైన దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వైట్ కలర్ డ్రెస్‌లో క్రాస్ నెక్లెస్, బ్రాస్‌లెట్, కళ్లజోడుతో స్టైలీష్‌గా ర్యాంప్ వాక్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.అదేంటి దీపికా పదుకొనే ఒక్కసారిగా ఇంత బొద్దుగా మారిపోయారు అసలు గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం సీనియర్ నటి రేఖతో పోలుస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ఈమె చివరిగా ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు త్వరలోనే కల్కి 2 ప్రారంభం కాబోతోంది.