సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్ అస్సలు ఉండదు.దాంతో ఊడే జుట్టు ఊడిపోతుంటుంది.
కానీ, కొత్త వెంట్రుకలు రావు, ఉన్న జుట్టు పొడవుగా పెరగదు.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను యూస్ చేయడం, జుట్టు సంరక్షణ లేకపోవడం, కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంటుంది.
ఈ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా.? అయితే ఇకపై అస్సలు టెన్షన్ పడవద్దు.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను మీ తలకు పట్టించి మసాజ్ చేసుకుంటే ఒత్తైన మరియు పొడవాటి కురులు మీసొంతం అవుతాయి.మరి ఆ ఆయిల్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కిందకు ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల డ్రైడ్ రోజ్ మేరీ ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసుకోవాలి.ఆ తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఆలివ్ ఆయిల్‌ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి స్లో ఫ్లేప్ పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేడి చేయాలి.
నూనె మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయిన వెంటనే స్ట్రైనర్ సాయంతో నూనెను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఏదైనా బాటిల్ లో నింపుకుంటే ఇరవై రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు.
ఈ నూనెను డైరెక్ట్‌గా తలకు పట్టించి ఐదు నుంచి పది నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.

రాత్రి నిద్రించే ముందు ఇలా ఆయిల్‌ను అప్లై చేసి.ఉదయాన్నే మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా మూడు రోజుకులకు ఒక సారి చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
మరియు తెల్ల జుట్టు సమస్య సైతం త్వరగా రాకుండా ఉంటుంది.