మనకు ఆకలి వేసినా,దాహం వేసినా వెంటనే నోరు తెరిచి అడిగేస్తాము.అదే ముగ జీవాలు, మొక్కలు అయితే తమకు ఆకలి వేసినప్పుడు ఎలా అడగగలవు అని ఎప్పుడన్నా ఆలోచించారా.
మనం పెట్టినపుడే అవి తింటాయి. మనం నీళ్లు పోసినప్పుడే మొక్కలు బతుకుతాయి.
అంతేకాని ఆ మొక్కలకు ఏప్పుడు నీళ్లు అవసరం అనే విషయం గురించి మనం ఎప్పుడు అలోచించి ఉండము.మనకు దాహం వేసినప్పుడు వెంటనే నీళ్లు తాగకపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది కదా.మరి అలాంటింది పాపం నోరు విప్పి చెప్పలేని మొక్కలు పరిస్థితి ఏంటి.? మనకి టైం దొరికినప్పుడు మాత్రమే వాటికీ నీళ్లు పోసి వాటి ఆలనా పాలన చూస్తున్నాము తప్పా వాటికీ ప్రాణం ఉంటుంది టైమ్ ప్రకారం మొక్కలకు కూడా నీళ్లు పోయాలి అని మనలో చాలా మంది ఆలోచించరు.
మొక్కలు కూడా వాటికీ నీళ్లు అవసరం అయినప్పుడు మాకు నీళ్లు పోయండి అని అంటే భలే ఉంటుంది కదా.అయితే ఎప్పుడు అలాంటి టెక్నాలజీ సహాయంతో మొక్కలకు నీళ్లు ఎప్పుడు కావాలో అనే విషయం.మనం తెలుసుకోవచ్చు.అదెలా అనుకుంటున్నారా… వివరాల్లోకి వెళితే.మొక్కలకు నీరు ఏ సమయంలో నీళ్లు కావాలనే విషయం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్‌ను తయారు చేసారు.ఈ పరికరం ద్వారా మొక్కలోని ఆకులకు నీరు ఏయే సమయాల్లో కావాలనే విషయాన్ని తెలియచేస్తుంది.
ఈ పరికరాన్ని బ్రెజిల్‌లోని బ్రెజిలియన్ నానోటెక్నాలజీ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
ఈ స్మార్ట్‌వాచ్ ను మొక్కలకు అమర్చడం వలన అది మొక్క యొక్క నీటి మట్టం ఎంత వరకు ఉందో గుర్తిస్తుంది.
అలాగే అంతర్గతంగా ఆ మొక్కకు ఎంత తేమ అవసరమో కూడా తెలుసుకోవచ్చు.ఈ మొక్కలోని నీటి స్థాయిని గుర్తించేందుకు ఆకులకు సెన్సార్‌ని అమర్చుతారు.ఈ సెన్సార్‌కి ఒక యాప్ లింక్ చేయబడింది.ఆ యాప్ ను యూజర్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
అలా మొక్కకు పెట్టిన సెన్సార్ మొక్కకు నీటి కొరత ఉన్న విషయాన్ని గుర్తించినప్పుడల్లా ఆ సమాచారాన్ని వినియోగదారుడి మొబైల్ లో ఉన్న యాప్‌కు సమాచారం అందిస్తుంది.అలా యాప్.
లో అలెర్ట్ వచ్చిన వెంటనే ఆ మొక్కలకు నీళ్లు పోయవచ్చు అన్నమాట.







