ప్రతి వివాహిత మహిళకు ఆనందంతో గెంతులేసే వార్త ఏదైనా ఉందంటే తను తల్లి కాబోతున్న విషయం అనే చెప్పాలి.ఈ న్యూస్ వలన వారు ఆనందంతో గంతులు వేస్తారు.
అయితే కొన్ని వారాల తర్వాత లేదా నెలల తర్వాత గర్భస్రావం( Miscarriage ) జరుగుతుంది.దీనివల్ల వారు ఎంతో కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
వారు పడ్డ ఆనందం మొత్తం దూరమైపోతుంది.ఒకవేళ పదేపదే గర్భస్రావం అయినా కూడా మానసికంగా కృంగిపోతారు.
అలా రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగితే తప్పకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.

అయితే చికిత్స కూడా గర్భస్రావానికి గల కారణాలపై ఆధారపడి ఉంటుంది.అయితే గర్భస్రావాలకు దారి తీసే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలా సార్లు గర్భస్రావం జరుగుతుందంటే క్రోమోజోమ్ ( Chromosome )సమస్యల కారణంగా జరుగుతుందని అర్థం.
ఈ జన్యుపరమైన సమస్యలు పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు అంతరాయం కల్పిస్తాయి.అలాగే తల్లి ఆరోగ్యం పెరుగుతున్న పిండంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి.
అంతేకాకుండా నియంత్రణ లేని మధుమేహం, థైరాయిడ్ వ్యాధి, ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమస్యలు, గర్భాశయ సమర్థత మొదలైనటువంటి గర్భస్రావాలకు దారితీసే కారణాలనీ చెప్పవచ్చు.

అంతేకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి కూడా గర్భస్రావాలకు దారితీస్తుంది.ధూమపానం, అధిక మధ్యపానం, సరైన ఆహారం, ఎక్ససైజ్ షెడ్యూల్ లేకపోతే గర్భస్రావాలకు దారి తీస్తుంది.ఇక ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్( Preimplantation genetic screening ) అనేది పిండం బదిలీకి ముందు పిండాల జన్యూ ప్రొఫైలింగ్ ను సూచిస్తుంది.
అయితే PGS స్క్రీనింగ్ ప్రక్రియలో పిండంలో క్రోమోజోమ్ అబ్ నార్మాలిటీస్ పరీక్షించడం జరుగుతుంది.అయితే ఈ క్రోమోజోమ్ అసాధారణ గర్భస్రావానికి దారితీస్తుంది.

అందుకే PGS టెక్నిక్ ని ఉపయోగించడం వలన ఉపయోగించడంతో వైద్యులు ఆరోగ్యకరమైన సాధారణ పిండాలను ఎంపిక చేసి గర్భాశయానికి బదిలీ చేస్తారు.ఇది విఫలమైన కూడా గర్భధారణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇక సాధారణంగా PGS పిండం అభివృద్ధి యొక్క బ్లాస్టోసిస్ట్ దశలో నిర్వహించబడుతుంది.ఇక దీనిలో 4 నుంచి 6 కణాలు బ్లాస్టోసిస్ట్ ట్రోఫెక్టోడర్మ్ భాగం నుంచి తీసుకోనబడతాయి.
ఆ తర్వాత జన్యు పరీక్ష కోసం పంపబడతాయి.
.