ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఏపీలో రాజకీయ సర్వేలు ప్రారంభించారు నేతలు.గతంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చేస్తున్న పనితీరు మంత్రులు, శాసనసభ్యులను హెచ్చరించడానికి పోలిటికల్ సర్వేను ఒక ట్రెండ్‌గా మొదలుపెట్టారు.
2024 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ముఖ‌్యమంత్రి జగన్ సర్వే చేయడానికి నిర్ణయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే చాలా మంది పార్టీ ఎమ్మెల్యేలు 40 నుంచి 50 శాతం మేజారీటి గెలపుపోందారని, వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడాలని ముఖ్యమంత్రి చేప్పినట్లు సమాచారం.2024లో ఇలాంటి ఎమ్మెల్యేలను మళ్ళీ పోటిలోకి దించాలని సీఎం భావిస్తున్నారు.
అయితే ప్రాదానంగా ముఖ్యమంత్రి జగన్ సర్వేలో రాణించలేకపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఇప్పుడు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.
ప్రతిపక్ష పార్టీలలోని వారి ప్రత్యర్థులు తమ కార్యక్రమాలను రూపొందించే ధోరణులపై స్పెషల్ డేటాను సర్వేను ప్రారంభించారు.వైసీపీ పార్టీ గడప గడపకు వైఎస్‌ఆర్‌సి ప్రజా సంప్రదింపు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రచారం చేయాలని ఇటీవల సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఆదేశించారు.
అయితే ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని వారిని ముఖ్యమంత్రి జగన్ తప్పిస్తామంటు సిరియస్ గా చేప్పనట్లు సమాచారం.దాదాపు 40 మంది ఎమ్మెల్యెలు బాగా పని చేయలేదని, దిద్దుబాటు చర్యలపై అధిస్టానం తెలిపింది.
అయితే సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేయడం, సచివాలయాల ద్వారా సర్టిఫికెట్ల జారీ సహా పనులు సులువుగా చేయడం వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.







