తెలంగాణ ఆర్టీసీలో( Telangana RTC ) మరోసారి సమ్మె సైరన్ మోగింది.ఆర్టీసీ కార్మికులు( TGSRTC Employees ) తమ 21 డిమాండ్లతో మళ్లీ సమ్మెకు రంగం సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేయగా, సోమవారం ఆర్టీసీ ఎండీని కలసి అఫిషియల్‌గా సమ్మె నోటీసు అందజేయనున్నారు.తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగింది.
కార్మిక సంఘాల నేతలు 21 డిమాండ్లతో ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు.ఈ డిమాండ్లలో ముఖ్యంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కార్మిక సంఘాలు( Employee Unions ) డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పీఆర్‌సీలను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కూడా కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు.అప్పటి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించాయి.అయితే, ఆ సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం కాస్త పెద్ద విషయంగా మారి,
ఆ సమ్మె జాతీయ దృష్టిని ఆకర్షించింది.2023లో జరిగిన ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రభుత్వం ఈ సమస్యలు త్వరగా పరిష్కరించి, కార్మికుల హక్కులను గౌరవించడమే కాకుండా, సమ్మె నిరసనను నివారించాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తారు.