టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు ఒకింత సంచలనం అవుతుంటాయి.రిలేషన్ షిప్ నుంచి బయటకు వచ్చి లైఫ్ ను లీడ్ చేయడం గురించి సమంత స్పందిస్తూ దాని నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో శ్రమించానని అన్నారు.
మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టడం గురించి ఆమె మాట్లాడుతూ నా లైఫ్ లో అసూయకు తావు లేదని పేర్కొన్నారు.
నా లైఫ్ లో అసూయ భాగం కావడాన్ని సైతం నేను అంగీకరించబోనని ఆమె పేర్కొన్నారు.
అసూయే అన్ని చెడులకు మూలమని నేను భావిస్తానని సమంత పేర్కొన్నారు.గతంలో కూడా నాగచైతన్య గురించి పలు సందర్భాల్లో సమంత రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య కోసం తాను ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశానని సమంత ఒక సందర్భంలో వెల్లడించారు.

నాగచైతన్య ,శోభిత ( Naga Chaitanya, Sobhita )వైవాహిక జీవితం విషయంలో ఒకింత ఆనందంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.శోభితతో పెళ్లి తర్వాత చైతన్య నటించిన సినిమా తండేల్ కాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.చైతన్య శోభిత జోడీ చూడముచ్చటగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య శోభిత కలిసి సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా సరైన స్క్రిప్ట్ దొరికితే నటించడానికి అభ్యంతరం లేదని చైతన్య ఒక సందర్భంలో వెల్లడించారు.తండేల్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు అమలు కాగా భారీ టికెట్ రేట్లు ఈ సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.గీతా ఆర్ట్స్ బ్యానర్ కు కూడా తండేల్ మూవీ ఫలితం కీలకం కానుంది.నాగచైతన్య తండేల్ సినిమా కథ, కథనం ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.