భారత సంతతి సింగర్ ప్రేమ్ థిల్లాన్ ఇంటిపై కాల్పులు .. ఉలిక్కిపడిన కెనడా

కెనడాలో స్థిరపడిన పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్ ( Prem Dhillon )నివాసం వెలుపల కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది.గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ గ్యాంగ్ దీని వెనుక ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

 Firing Outside Punjabi Singer Prem Dhillon Residence In Canada , Prem Dhillon ,-TeluguStop.com

థిల్లాన్ ఇంటిపై కాల్పులు జరిపిన వ్యక్తిని జెంటా ఖరాద్‌‌గా గుర్తించారు.ఇతను మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అర్ష్ దల్లా( Most wanted gangster Arsh Dalla ) అనుచరుడు కూడా.

భుల్లర్ గ్యాంగ్ విడుదల చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రేమ్ థిల్లాన్.దివంగత కాంగ్రెస్ నేత, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు ద్రోహం చేశాడని ఆరోపించింది.

బూట్ కట్, మఝా బ్లాక్, ఓల్డ్ స్కూల్ వంటి హిట్ సాంగ్స్‌‌తో ప్రేమ్ థిల్లాన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.అయితే గతంలోనూ కెనడాలో స్థిరపడిన పలువురు పంజాబీ గాయకుల ఇళ్లపైనే ఇలాంటి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఏపీ థిల్లాన్, గిప్పీ గ్రెవాల్‌‌ల( AP Thillon , Gippy Grewal ) నివాసాల వద్ద జరిగిన కాల్పులకు గ్యాంగ్ వారే కారణమని కెనడా పోలీసులు పలుమార్లు ఆరోపించారు కూడా.

Telugu Ap Thillon, Canada, Punjabiprem, Gippy Grewal, Jatt Hunde Aa, Gangsterars

ఇకపోతే.ప్రేమ్ థిల్లాన్ అని పిలవబడే ప్రేమ్‌జిత్ సింగ్ థిల్లాన్ కెనడాలోని పంజాబీ గాయకుడు.జనవరి 4, 1995న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు.

చాన్ మిలోండి అనే సింగిల్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.ఆయన పాడిన బూట్ కట్ సాంగ్‌కు 37 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.2020లో సిద్ధూ మూసేవాలా, సీబ్ నటించిన ఓల్డ్ స్కూల్ సాంగ్‌ను విడుదల చేశారు.తర్వాత ప్రేమ్ పాడిన ‘జట్ హుండే ఆ ’( Jatt Hunde Aa ) భారత్‌లోని యాపిల్ మ్యూజిక్ చార్ట్‌లో 38వ స్థానంలో నిలిచింది.

Telugu Ap Thillon, Canada, Punjabiprem, Gippy Grewal, Jatt Hunde Aa, Gangsterars

కాగా.2022 మే 29న తన అనుచరులు, మిత్రులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మూసేవాలాపై గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరికి గాయాలయ్యాయి.మూసేవాలా హత్య తమ పనేనని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube