పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా చాలా కాలం క్రితమైన మొదలైన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ నత్త నడకన సాగుతున్న సంగతి తెలిసిందే.మార్చి నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు ఈ సినిమాలోని నటీనటుల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదట అర్జున్ రాంపాల్( Arjun Rampal ) తప్పుకోగా ఆయన స్థానంలో బాబీ డియోల్( Bobby Deol ) వచ్చారు.
ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకున్నారు.క్రిష్ కు బదులుగా ప్రస్తుతం జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ్ ఖేర్ తప్పుకోగా ఆయన స్థానంలో సత్యరాజ్( Satyaraj ) నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక సినిమా నుంచి కీలక నటులు, టెక్నీషియన్లు తప్పుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.హరిహర వీరమల్లు మూవీ లాస్ట్ షెడ్యూల్ తాజాగా మొదలైందని తెలుస్తోంది.హరిహర వీరమల్లు అనుకున్న తేదీకి పూర్తవుతుందో లేదో చూడాలి.
ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి.హరిహర వీరమల్లు సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజవుతుండగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండటం గమనార్హం.పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రానుంది.పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పే అవకాశం అయితే ఏ మాత్రం లేదని తెలుస్తోంది.