టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు( Pooja Hegde ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లేకపోయినా ఆఫర్లు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి.
అయితే రాధేశ్యామ్ సినిమా వల్ల రెట్రో సినిమాలో ఛాన్స్ దక్కిందంటూ పూజా హెగ్డే చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.రెట్రో సినిమాలో తాను విభిన్నమైన రోల్ పోషించానని ఆమె అన్నారు.
రాధేశ్యామ్ సినిమా( Radheshyam movie ) వల్ల ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుకు ( Director Karthik Subbarajuku )రాధేశ్యామ్ సినిమాలో నా ఎమోషనల్ సీన్స్ ఎంతో నచ్చాయని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.
రెట్రోలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో నన్ను ఎంపిక చేయడం జరిగిందని పూజా హెగ్డే అభిప్రాయం వ్యక్తం చేశారు.రెట్రో మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

విజయ్ తో ఇప్పటికే బీస్ట్ మూవీలో ( Beast )నటించిన పూజా హెగ్డే ప్రస్తుతం జన నాయగన్ సినిమాలో( Jana Nayagan ) కూడా నటిస్తున్నారు.విజయ్ చివరి మూవీ అని తెలిసిన వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆ సినిమాకు ఓకే చెప్పానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.ఈ సినిమా హెచ్.వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.విజయ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

మరోవైపు పూజా హెగ్డే అల వైకుంఠపురములో సినిమా గురించి ప్రస్తావిస్తూ పొరపాటున తమిళ సినిమా అని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పూజా హెగ్డే కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పూజా హెగ్డే కెరీర్ పరంగా ఎదగాలని సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.