ఇటీవల కాలంలో ఎంతోమంది పెళ్లిళ్లు జరిగిన కొద్ది నెలలకే విడాకులు( Divorce ) తీసుకొని విడిపోతున్నారు.ఈ విధంగా ఎంతోమంది ఇప్పటికే విడాకులు తీసుకొని వీడిపోయి రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా విడాకుల కల్చర్ అనేది ఒకప్పుడు విదేశాలలో ఎక్కువగా ఉండేది అనంతరం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్కృతి అధికంగా ఉండేది కానీ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు.కేవలం చిత్ర పరిశ్రమలో అని మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా చిన్నచిన్న విషయాలకి విడాకులు తీసుకొని విడిపోవడం జరుగుతుంది.

ఇలా ఇటీవల కాలంలో విడాకులు అనే మాట ఎక్కువగా వినపడుతున్న నేపథ్యంలో సీనియర్ నటి మాజీ మంత్రి రోజా( Roja ) సైతం విడాకుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఇటీవల కాలంలో విడాకులు ఎక్కువగా తీసుకొని విడిపోవడానికి కారణం లేకపోలేదు.ప్రస్తుత జనరేషన్ లో అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలు కూడా ప్రతి ఒక్క రంగంలోనూ రాణిస్తున్నారు.ఈ క్రమంలోనే భర్త ఎప్పుడైతే భార్య కంటే తానే గొప్ప అనే అహంకారం భార్య వద్ద చూపెడతారో అప్పుడే ఇద్దరీ మధ్య గొడవలు మొదలవుతాయి అని తెలిపారు.

భర్త తానే ఎక్కువ అనే అహంకారం బయటపెట్టినప్పుడు కొంతమంది మహిళలు అది తట్టుకోలేక నీ కంటే నేనేం తక్కువ కాదు అంటూ భర్తతో గొడవకు దిగుతున్నారు.ఈ గొడవ కాస్త విడాకుల వరకు వెళుతుందని రోజా తెలిపారు.అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు కలిసి ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకోరని రోజా తెలిపారు.మనం విడాకులు తీసుకోవడం వల్ల నష్టపోయేది ఎవరు? మన వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు అనే విషయాలను ఆలోచిస్తే విడాకులు ఆలోచన రాదని తెలిపారు.ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నవారు ఒకటి కాదు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారి జీవితం సంతోషంగా ఉండదని రోజా తెలిపారు.