క్రిష్ సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రిష్ సిరీస్ కు( Krrish Series ) అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ దక్కింది.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ క్రిష్ సిరీస్ మెప్పించింది.క్రిష్3 విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా మంచి ఫలితాన్ని సొంతం చేసుకుందనే చెప్పాలి.
అయితే భారీ బడ్జెట్ వల్లే క్రిష్4 సినిమాను( Krrish 4 ) తెరకెక్కించలేక పోతున్నానని రాకేష్ రోషన్( Rakesh Roshan ) తెలిపారు.క్రిష్4 సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.కానీ మేము ఎంత ప్రయత్నించినా సినిమాకు అవసరమైన బడ్జెట్ సమకూరడం లేదని రాకేష్ రోషన్ చెప్పుకొచ్చారు.అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని వెల్లడించారు.

క్రిష్4 సినిమాను మరింత భారీగా తెరకెక్కించాలని ఆయన పేర్కొన్నారు.ఈ మూవీ బడ్జెట్ ను తగ్గించాలని చూస్తే ఈ సినిమా ఒక సాధారణ కథగా మిగిలిపోతుందని రాకేష్ రోషన్ అన్నారు.ప్రస్తుతం ప్రపంచం చిన్నదిగా మారిపోయిందని అరచేతిలో ఉండే సెల్ ఫోన్ లో మొత్తం తెలిసిపోతుందని ఆయన వెల్లడించారు.ఈరోజుల్లో పిల్లలు సైతం ఎంతోమంది సూపర్ హీరోల సినిమాలను చూస్తున్నారని ఆయన తెలిపారు.

మనం చిన్న తప్పు చేసినా వారి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాకేష్ రోషన్ పేర్కొన్నారు.అందుకే మరింత జాగ్రత్తగా దీన్ని తీయాలని రాకేష్ రోషన్ వెల్లడించారు.హాలీవుడ్ లో సూపర్ హీరోల సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయని అది మనకు సాధ్యం కాదని అంత ఖర్చు మనం భరించలేమని రాకేష్ రోషన్ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో క్రిష్4 మూవీ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.క్రిష్4 ఎప్పుడు తెరకెక్కినా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.