దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.టమాటోతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.
అయితే కొందరు టమాటోను వండుకుని తింటే.ఇంకొందరు పచ్చిగా తింటుంటారు.
అసలు టమాటోను పచ్చిగా తినొచ్చా? అని అడిగితే ఆరోగ్య నిపుణులు తినొచ్చనే చెబుతున్నారు.పచ్చి టమాటోల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )ఉంటాయి.
టమాటోను నేరుగా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి.
పచ్చి టమాటోల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
టమాటోల్లో లైకోపీన్ ( Lycopene )ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇది హృద్రోగాల ప్రమాదంతో పాటు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో తోడ్పడుతుంది.
అలాగే టమాటోను పచ్చిగా తినడం కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.టమాటోలో విటమిన్ ఎ ( Vitamin A )మరియు లుటెయిన్ మెండుగా ఉంటాయి.
ఇవి కంటిచూపు మెరుగుపరుస్తాయి.రాత్రి సమయంలో చూపు సమస్యలు రాకుండా నిరోధిస్తాయి.

మలబద్ధకంతో( constipation ) బాధపడుతున్నవారు రోజుకు ఒక టమాటో పచ్చిగా తింటే మంచిది.టమాటోలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.తక్కువ క్యాలరీలు, ఫైబర్ ( Calories, fiber )మరియు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారు టమాటోను పచ్చిగా తీసుకోవడం మంచి ఎంపిక అవుతుంది.
టమాటోను సలాడ్స్ లేదా స్మూతీల్లో కలిపి తింటే శరీరానికి తేలికగా జీర్ణమవుతుంది.

టమాటోను పచ్చిగా తినడం వల్ల అందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.చర్మాన్ని మెలానిన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి.
అయితే టమాటోలను పచ్చిగా తీసుకోవడం సురక్షితమే కానీ అధికంగా తింటే కొన్ని సమస్యలు రావొచ్చు.కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే, పచ్చి టమాటోలు తీసుకోవడం వల్ల గ్యాస్ లేదా అసిడిటీ పెరగొచ్చు.
కాబట్టి మితంగా తీసుకోవడం ఉత్తమం.







