ఇల్లినాయిస్‌కు( Illinois ) చెందిన ఓ వ్యక్తిని ఊహించని రీతిలో అదృష్టం తలుపు తట్టింది.సెకండ్ హ్యాండ్ షాపులో కేవలం రూ.415 పెట్టి కొన్న ప్లేటు, అతడి జీవితాన్నే మార్చేసింది.అది సాదాసీదా ప్లేటు కాదు, ఏకంగా 18వ శతాబ్దానికి చెందిన చైనా కళాఖండం.దాని విలువ తెలిస్తే అక్షరాలా రూ.3.66 లక్షల పైమాటే కావడం విశేషం.జాన్ కార్సెరానో అనే వ్యక్తి, వృత్తిరీత్యా కార్పెట్ క్లీనర్.35 ఏళ్లుగా సెకండ్ హ్యాండ్ వస్తువులు వెతకడంలో ఎక్స్‌పర్ట్.గుడ్‌విల్ స్టోర్‌లో వస్తువులు చూస్తుండగా, ఓ మూలన పడేసిన బండిలో ఈ ప్లేటు కనిపించింది.
దానిపై మరో మోడరన్ ప్లేటు ఉండటంతో మొదట అతడు చూడలేదు.కానీ చివరి క్షణంలో ఏదో మెరుపులా అనిపించి దాన్ని గమనించాడు.
ఇంతకీ ఈ ప్లేటులో ఏముంది అంత ప్రత్యేకత అని అనుకుంటున్నారు కదూ, జాన్ కార్సెరానోకి ( John Carcerano )కూడా మొదట తెలీదు.ఇంటికి వెళ్లాక గూగుల్ లెన్స్ యాప్ వాడి చూడగా అసలు విషయం తెలిసింది.
గంటల వ్యవధిలో కాదు, కేవలం ఐదు నిమిషాల్లోనే అది చాలా అరుదైన వస్తువు అని గుర్తించాడు.గత 50 ఏళ్లలో ఇలాంటి ప్లేట్లు వేలంలో కేవలం రెండే అమ్ముడయ్యాయని తెలుసుకున్నాడు.రీసెంట్‌గా ఒక ప్లేటు ఏకంగా రూ.3.66 లక్షలకు అమ్ముడుపోవడంతో జాన్ ఒక్కసారిగా షాకయ్యాడు.వెంటనే అది తన అదృష్టాన్ని మార్చే ప్లేట్ అని ఫిక్స్ అయిపోయాడు.

అయితే, ఇది నిజమైన ఆర్ట్‌ఫాక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి జాన్ దాన్ని నేరుగా నిపుణుల దగ్గరికే తీసుకెళ్లాడు.న్యూయార్క్‌లోని సోథెబీస్, చికాగోలోని బోన్‌హామ్స్, లెస్లీ హిండ్‌మాన్స్ ( Sotheby’s in New York, Bonhams in Chicago, Leslie Hindmans )వంటి ప్రముఖ వేలం సంస్థలకు వెళ్లాడు.వాళ్లంతా ఇది 1775 ప్రాంతానికి చెందిన క్వింగ్ రాజవంశం కియాన్‌లాంగ్ కాలం నాటి “చైనీస్ ఎక్స్‌పోర్ట్ ఆర్మోరియల్ చంఫెర్డ్ రెక్టాంగులర్ ప్లాటర్” అని తేల్చారు.అంతేకాదు, దాని విలువ రూ.3.33 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఇంకా నమ్మకం కలగక జాన్ ఫేస్‌బుక్‌లో ఉన్న చైనీస్ పురాతన వస్తువుల గ్రూపుల్లో ఈ ప్లేటు ఫోటోలు పెట్టాడు.అక్కడ నిపుణులు కూడా ఇది చాలా అరుదైన వస్తువు అని కన్ఫర్మ్ చేశారు.ప్లేటు కొత్తగా, ఎలాంటి గీతలు లేకుండా ఉండటం వల్ల దాని విలువ మరింత పెరిగిందని జాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.సెకండ్ హ్యాండ్ షాపుల్లో వస్తువులు వెతకడంలో తనకున్న అనుభవమే ఈ అద్భుతమైన ఆవిష్కరణకు కారణమని జాన్ చెబుతున్నాడు.“కొత్త సరుకు బండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటాను.ఎందుకంటే మంచి వస్తువులు క్షణాల్లో మాయమవుతాయి” అని అతడు తెలిపాడు.నిజంగా అదృష్టం అంటే ఇదే కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







