ఈ 3 సింపుల్ చిట్కాలను పాటిస్తే మలబద్ధకం మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

మలబద్ధకం ( Constipation ) కోట్లాది మంది అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.కానీ ఈ సమస్యను బయటకు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడరు.

 Three Simple Tips To Get Rid Of Constipation!, Constipation, Constipation Relief-TeluguStop.com

అలా అని మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కొందరు మందులు కూడా వాడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే మూడు సింపుల్ చిట్కాలను( Simple Tips ) పాటిస్తే మలబద్ధకం మీ దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Simple Tips, Tips, Latest-Telugu Health

అవిసె గింజలు.( Flax Seeds ) ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను అవిసె గింజలతో సహా తీసుకోవాలి.

రోజుకు ఒకసారి చేస్తే జీర్ణవ్యవస్థ( Digestion ) పనితీరు మెరుగుపడుతుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు మిరియాల పొడి మిక్స్ చేసి సేవించాలి.ఇలా చేస్తే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

మలబద్ధకం సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ( Acidity ) వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.

Telugu Simple Tips, Tips, Latest-Telugu Health

ఇక మలబద్దకం సమస్యకు చెక్ పెట్టేందుకు మరొక అద్భుతమైన చిట్కా ఉంది.దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేరుగా తినాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే మలబద్ధకం అన్న మాటే అనరు.మలబద్ధకం సమస్యను తరిమి కొట్టడానికి ఈ చిట్కా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube