తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలో మంటల మిస్టరీ వీడింది.గత కొన్ని రోజులుగా గ్రామంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్ ఫెయిల్ అయిన కీర్తి అనే యువతి తన తల్లిపై ద్వేషంతో మంటల డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు.మొదట ఓ గడ్డివాముకు కొందరు ఆకతాయిలు నిప్పుపెట్టారు.
అదే అదునుగా భావించిన యువతి తాను కూడా గడ్డి వాముకు నిప్పు పెట్టింది.తరువాత బంధువుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టిందని పోలీసులు నిర్ధారించారు.20 రోజులుగా ఇలా జరగడంతో గ్రామంలో ఏదో జరిగిపోతుందని ప్రచారం జరిగింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్టరీ ఛేదించారు.







