టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.సూపర్ డూపర్ హిట్స్‌తో టాప్ హీరోగా ఎదిగాడు మహేష్ బాబు.
తండ్రి ద్వారా సినిమాల్లోకి వచ్చినా.తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు.
ఆయన నటించిన పలు చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి.కలెక్షన్లతో పాటు మంచి ప్రేక్షక ఆదరణ పొందారు.
ఈయన నటించిన పలు చిత్రాలు హిందీలోకి రీమేక్ చేశారు.ఇంతకీ రీమేక్ అయిన మహేష్ సినిమాలు.
హిట్ అయ్యాయా? లేదా? ఇప్పుడు చూద్దాం!
ఒక్కడు:
గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.మహేష్ బాబు, భూమిక హీరో, హీరోయిన్లుగా నటించారు.ప్రకాశ్ రాజ్ విలన్‌గా చేశాడు.2003లో వచ్చిన ఈ సినిమా బంఫర్ హిట్ అయ్యింది.పలు అవార్డులను పొందింది.ఈ సినిమా అప్పట్లో హిందీలోకి రీమేక్ అయ్యింది.తేవర్ పేరుతో రవీంద్రనాథ్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కింది.మనోజ్ వాజ్‌పేయి విలన్‌గా చేశారు.
ఈ సినిమా బాలీవుడ్లో మాత్రం సక్సెస్ కాలేదు.
అతడు:

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు, త్రిష హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందింది.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించింది ఈ సినిమా.ఇదే సినిమాను బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు.
ఏక్ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది.బాబీ డియోల్, శ్రియా హీరో, హీరోయిన్లు.
ఈ సినిమా కూడా అక్కడ బోల్తా కొట్టింది.
పోకిరి:

పూరీ దర్శకత్వంలో మహేష్, ఇలియానా హీరో, హీరోయిన్లుగా తెరెక్కిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.200 సెంటర్లలో 100 రోజులు ఆడి ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాతో మహేష్ స్థాయి ఓరేంజికి పెరిగింది.
ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేశారు.వాంటెడ్ పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఈసినిమా రూపొందింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.