పోషకాహార నిపుణులు రోజులో రెండు సార్లు తప్పనిసరిగా పెరుగు తినాలని చెప్పుతున్నారు.ప్రతి రోజు మనం తీసుకొనే ఆహారంలో పెరుగు మంచి ఔషధంగా పనిచేసి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పెరుగులో ఉండే ఖనిజాలు,ప్రోటీన్స్,ఏషన్షియల్ విటమిన్స్ మన శరీరంలో శక్తిని పెంచుతాయి.
మెంతులను మనం ప్రతి రోజు వంటలలో వాడుతూ ఉంటాం.
మెంతులు వంట రుచిని పెంచుతుంది.అలాగే మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
అందువల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు చేకూరతాయి.ముఖ్యంగా మెంతుల్లో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి తక్కువ స్థాయిలో లిపో ప్రోటీన్ ఉంటుంది.
మెంతుల్లో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు మరియు గుండె వేగాన్ని నియంత్రిచటంలో సహాయపడుతుంది.మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో మెంతులను చేర్చుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
వీటిలో అమైనో ఆమ్లం ఉండుట వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.అందువల్ల మెంతులు మధుమేహ వ్యాధి గ్రస్తులకు వరం అని చెప్పవచ్చు.మెంతుల్లో ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో విషాలను బయటకు పంపేసి జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది.
కొద్దిగా మెంతులను పెరుగుతో కలిపి తీసుకుంటే అతిసార సమస్య నుండి బయట పడవచ్చు.
ఒక స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగితే శరీరంలో విషాలు తొలగిపోవటమే కాకుండా బరువు కూడా తగ్గుతాం.అలాగే కొలస్ట్రాల్ తగ్గటం వలన పొట్ట కూడా తగ్గిపోతుంది.
మెంతులను వేగించి పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని త్రాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.అలాగే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
పెరుగును ముఖానికి రాయటం వలన చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది.