రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో( Chittorgarh ) వెలిసిన శ్రీ సాన్వాలియా సేథ్ టెంపుల్‌కు( Shri Sanwalia Seth Temple ) భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు.భక్తితో జనం పోటెత్తడంతో కానుకలు( Donations ) వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఒక్క నెలలోనే టెంపుల్ హుండీ నిండిపోయింది.ఏకంగా రూ.22 కోట్ల 92 లక్షల 13 వేల 317 రూపాయల విరాళాలు వచ్చి పడ్డాయంటే నమ్మండి.ఇది మామూలు విషయం కాదు.
జనవరి 28న టెంపుల్ అధికారులు, బోర్డు ప్రెసిడెంట్, సభ్యుల సమక్షంలో హుండీ తెరిచి లెక్కించడం మొదలుపెట్టారు.మొదటి విడతలోనే రూ.8.08 కోట్లు దర్శనమిచ్చాయి.మౌని అమావాస్య కావడంతో జనవరి 29న లెక్కింపుకు బ్రేక్ వేశారు.తిరిగి జనవరి 30న రెండో విడత స్టార్ట్ చేయగా రూ.4.54 కోట్లు వచ్చి పడ్డాయి.ఇక జనవరి 31న మూడో విడతలో రూ.3.70 కోట్లు లెక్క తేల్చారు.నాలుగో విడత పూర్తయ్యేసరికి మొత్తం విరాళాలు రూ.16.32 కోట్లకు చేరాయి.

ఐదో విడతలో అసలు ట్విస్ట్ బయటపడింది.హుండీతో పాటు ఆఫీసు, ఆన్‌లైన్ ద్వారా వచ్చిన కానుకలు లెక్కించగా మరో రూ.5.92 కోట్లు వచ్చి చేరాయి.దీంతో టోటల్ కలెక్షన్ రూ 22.92 కోట్లకు దాటేసింది.అంటే అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది
డబ్బులే కాదు.భక్తులు బంగారం, వెండి కూడా భారీగా సమర్పించారు.ఏకంగా 665 గ్రాముల బంగారం, 133 కిలోల 654 గ్రాముల వెండి కానుకల రూపంలో టెంపుల్‌కి వచ్చాయి.ఇది చూస్తుంటే సాన్వాలియా సేథ్‌పై భక్తుల నమ్మకం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోయిన నెలలో కూడా టెంపుల్‌కి దాదాపు రూ.23 కోట్ల విరాళాలు వచ్చాయి.అంటే ప్రతి నెలా కానుకలు పెరుగుతూనే ఉన్నాయి.భక్తుల విశ్వాసం, దాతృత్వం గొప్పగా కొనసాగుతోంది.ఈ డబ్బుతో టెంపుల్‌ని మరింత అభివృద్ధి చేస్తామని, మతపరమైన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని టెంపుల్ బోర్డు తెలిపింది.
భక్తులు( Devotees ) ఇంతలా కానుకలు ఇస్తుంటే టెంపుల్ బోర్డు ఊరుకుంటుందా, వెంటనే కొత్త హుండీ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తుంటే, కానుకలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కదా, భవిష్యత్తులో సాన్వాలియా సేథ్ టెంపుల్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.