టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అలాంటి నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ ( Geetha Arts ) నిర్మాణ సంస్థ కూడా ఒకటీ.అల్లు అరవింద్ నిర్మించిన ఈ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ గీత భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే గీత ఆర్ట్స్ 2 ( Geetha Arts 2 )బ్యానర్ కూడా ఏర్పాటు చేసి ఈ బ్యానర్ పై మీడియం రేంజ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక గీత ఆర్ట్స్ 2 బ్యానర్ బాధితులన్నీ కూడా అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు( Bunny Vasu ) చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఇక తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన తండేల్ ( Thandel )సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలలో బన్నీ వాసు బిజీ అవుతున్నారు.ఈ క్రమంలోనే బన్నీ వాసుకి సంబంధించి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి బయటకు రాబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై బన్నీ వాసు స్పందించారు.

తాను గీత ఆర్ట్స్ 2 లో తెరకెక్కించే సినిమాల విషయంలో ఫైనల్ డెసిషన్ అల్లు అరవింద్( Allu Aravind ) గారిదే అని.ఐతే కొన్ని కథల విషయంలో తనకు అల్లు అరవింద్ గారికి కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే నాకు నచ్చిన సినిమాలన్నింటిని నేను గీత ఆర్ట్స్ 2 లో చేసుకునే వెసులుబాటు కూడా అల్లు అరవింద్ గారు నాకు ఇచ్చారని ఈయన వెల్లడించారు.ఇకపై నాకు నచ్చిన సినిమా కథలను గీత ఆర్ట్స్ 2 లో తెరకెక్కించి కచ్చితంగా మీ ముందుకు తీసుకు వస్తానని ఈయన వెల్లడించారు.
ఇలా బన్నీ వాసు చేసిన ఈ కామెంట్లతో ఈయన గీత ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పేశారు.