అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ).మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాలను సొంతం చేసుకున్నారు.
ఇలా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్న లావణ్య త్రిపాటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) తో కలిసి పలు సినిమాలలో నటించారు.అనంతరం ఆయన ప్రేమలో పడిన ఈమె పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలలో నటిస్తారా లేదా అనే విషయంపై అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.

ఈమె పెళ్లి జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతున్న ఇప్పటికీ కూడా కొత్త సినిమాలను ప్రకటించకపోవడంతో బహుశా లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరం అవుతారని అందరూ భావించారు కానీ ఈమె మాత్రం ఇటీవల తన కొత్త సినిమాని ప్రకటించారు.ఇలా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి మొదటి సినిమాని ప్రకటించడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా రామోజీ ఫిలిం సిటీ లోని సంఘీ టెంపుల్లో ఘనంగా జరిగాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ( Dev Mohan ) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఈ చిత్రానికి సతి లీలావతి( Sathi Leelavathi ) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వం వహించగా దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని మోహన్ బాబు.ఎమ్, రాజేష్.
టి కలిసి నిర్మిస్తున్నారు.