వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆ సినిమాలను మించిన హిట్ గా నిలిచింది.సంక్రాంతికి వస్తున్నాం నైజాం హక్కుల విలువ 8.50 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా ఫుల్ రన్ లో 41 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఈ సినిమా 4 రెట్ల లాభాలను సొంతం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో బడ్జెట్ కలెక్షన్ల లెక్కల్లో ఈ స్థాయిలో లాభాలను అందించిన సినిమా ఇది మాత్రమేనని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా( sankrantiki vastunnam ) ఈ స్థాయిలో లాభాలను అందిస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు.
పండగ కానుకగా విడుదలైన సినిమాలలో ఆలస్యంగా విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అయినప్పటికీ లాభాల విషయంలో మాత్రం ఈ సినిమానే టాప్ లో ఉంది.

నైజాం లాభాల విషయంలో 4 రెట్లు లాభాలను అందించిన సినిమాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే.నైజాం ఏరియా పెద్ద సినిమాల కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీకి తర్వాత రోజుల్లో కూడా ఒకింత భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
నైజాం ఏరియా టాలీవుడ్ బెస్ట్ ఏరియా అయింది.

అయితే టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభిస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్ సినిమాలు నైజాం ఏరియాలో మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.ఫిబ్రవరి నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజవుతున్నా కలెక్షన్ల విషయంలో ఎన్ని సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల విషయంలో సృష్టిస్తున్న సంచలనాలు ఇండస్ట్రీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.